బస్సులో వెళుతున్న యువతికి బలవంతంగా తాళి కట్టిన యువకుడు.. బాధితురాలి కేకలు!
- తమిళనాడులోని సాండ్రోర్ కుప్పంలో ఘటన
- యువకుడి ప్రేమను ఒప్పుకోని యువతి
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు
ఇటీవల యువతికి వివాహం నిశ్చయమైంది. విషయం తెలిసిన నిందితుడు తాను ప్రేమిస్తున్నట్టు ఆమెకు చెప్పాడు. అయితే, ఇందుకామె నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. నిన్న ఉదయం యువతి బస్సులో అంబూరు నుంచి వాణియంబాడికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అతడు కూడా అదే బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరాక సీట్లో కూర్చున్న యువతి వద్దకు వెళ్లి ఒక్కసారిగా ఆమె మెడలో తాళి కట్టాడు. దీంతో విస్తుపోయిన ఆమె కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.