అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించింది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- 'పౌరసత్వ సవరణ బిల్లు'పై ఇమ్రాన్ అభ్యంతరాలు
- పాక్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచింది
- హిందూ దేశ భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది
అలాగే, తమ దేశంతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని అన్నారు. ఈ బిల్లుపై ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించడం గమనార్హం. హిందూ దేశ భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ ఆర్ఎస్ఎస్ అనడం సరికాదని అన్నారు. కాగా, ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లు పట్ల మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.