Siddharth: యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న 'టక్కర్'

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో సిద్దార్థ్ కి మంచి క్రేజ్ వుంది. కొత్త కథానాయకుల కారణంగా పోటీ పెరిగినా, విభిన్నమైన కథలతో .. విలక్షమైన పాత్రలతో అప్పుడప్పుడు పలకరిస్తూనే వున్నాడు. అలా ఆయన తాజా చిత్రంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'టక్కర్' అనే టైటిల్ ను ఖరారు చేసి, వరుణ్ తేజ్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయించారు. టైటిల్ కి మంచి మార్కులు పడిపోయాయి. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అభిమన్యు సింగ్ .. యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Siddharth
Divyansha Kausik

More Telugu News