భారత మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్ వీ 17
- డిస్ ప్లేలో అంతర్భాగంగా సెల్ఫీ కెమెరా
- ఈ నెల 17 నుంచి అమ్మకాలు ప్రారంభం
- రెండు రంగుల్లో లభ్యం కానున్న ఫోన్ ధర రూ.22,990
స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ ప్రధాన రేర్ కెమెరాతో పాటు 8+2+2 ఎంపీ సామర్థ్యమున్న కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు డిస్ ప్లే లో అంతర్భాగంగా 32 ఎంపీ సామర్థ్యమున్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. యూఎస్ బీ, టైప్ సి పోర్ట్, బ్లూటూత్ 5.0, ఫింగర్ ప్రింట్, జెండర్ డిటెక్షన్, తదితర ఫీచర్లతో పాటు 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,990గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ/128 జీబీ స్టోరేజీతో వస్తోన్న వి17 మోడల్ ఫోన్లు ఆన్ లైన్ విక్రయ సంస్థలు అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, వివో ఇండియా ఈ స్టోర్ తో పాటు.. ఆఫ్ లైన్ దుకాణాల్లో కూడా లభ్యమవుతాయి.