తన జీవితంలో మొట్టమొదటిసారిగా రంగులను గుర్తించి ఓ బాలుడి భావోద్వేగాలు... వీడియో చూడండి!
- 12 ఏళ్లుగా వర్ణాంధతతో బాధపడుతున్న బాలుడు
- ప్రత్యేక కళ్లద్దాలతో రంగుల గుర్తింపు
- ఆనందంతో కంటతడి
మిన్నెసోటాకు చెందిన బాలుడు కూడా ఈ కళ్లద్దాలు ధరించి ఎదురుగా ఉన్న మనుషులు, వారి ధరించిన దుస్తులు, వస్తువుల రంగులను గుర్తించి ఆనందం పట్టలేకపోయాడు. 12 ఏళ్లుగా అందనిది కళ్లెదురుగా సాక్షాత్కారమైతే తట్టుకోలేక తీవ్రభావోద్వేగాలకు లోనయ్యాడు. కళ్లల్లోంచి నీళ్లు ఉబికివస్తుండగా అదుపు చేసుకోలేకపోయాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.