ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వండి: కేజ్రీవాల్ ఆదేశం
- విచారణకు ఆదేశించాను
- గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం
- ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తాం
'ఇది చాలా బాధాకర ఘటన. దీనిపై విచారణకు ఆదేశించాను. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చాను. అలాగే, గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున అందిస్తాం. వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తాం' అని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రమాద ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.