Prakash Reddy: ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...: డీసీపీ ప్రకాశ్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
దిశ హత్య కేసు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆ పరిస్థితుల్లో తప్పనిసరై తాము ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ తెల్లవారుజామున సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారని, ఆ వెంటనే ఫైరింగ్ ను ఓ పెన్ చేశారని తెలిపారు. ఆత్మ రక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని, తామేమీ ఎన్ కౌంటర్ చేసి వారిని హతమార్చాలన్న ఆలోచనలో లేమని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Prakash Reddy
Police
Shamshabad
Encounter

More Telugu News