ఈ నెల 15 నుంచి వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. ఛార్జీల వడ్డింపుకి సిద్ధం!
- రోజువారీ నగదు లావాదేవీలపై చార్జీల భారం
- నెలలో 4 విడతలు మాత్రమే ఉచితం.. ఆపై రూ.150 వడ్డన
- సొంత శాఖలో 2 లక్షల వరకూ ఉచిత లావాదేవీలు
నెలకు 4 సార్లు నగదు లావాదేవాలు ఉచితంగా చేసుకోవచ్చు, అంతకు మించితే 150 రూపాయలు వసూలు చేస్తారు. తమ ఖాతా ఉన్న బ్రాంచి నుంచి 2 లక్షల రూపాయల వరకూ ఉచితంగా లావాదేవీలు (డిపాజిట్ లేక విత్ డ్రా) చేసుకోవచ్చునని పేర్కొనడం ద్వారా ఖాతా దారులకు కొంత ఊరటను కలిగించింది. అలాగే రోజువారీ జరిపే లావాదేవీల్లో భాగంగా రూ.25 వేల వరకు ఉచిత పరిమితిని ప్రకటించింది. అంతకు మించితే వెయ్యి రూపాయలకు గాను రూ.5 లేదా కనీసం రూ.150 ఛార్జీ వడ్డన ఉంటుంది. థర్డ్ పార్టీ లావాదేవీల సవరణలో భాగంగా రూ.25 వేల ట్రాన్సాక్షన్ కు రూ.150 రూపాయలను రుసుముగా పేర్కొనడంతో పాటు, రూ.25 వేలకు మించిన థర్డ్ పార్టీ లావాదేవీలపై నిషేధం విధించినట్లు తన వెబ్ సైట్ లో పేర్కొంది.