చంద్రయాన్-2 ప్రయోగంతో దేశానికి చెడ్డపేరు వచ్చింది: లోక్ సభలో తృణమూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

  • విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో చెడ్డ పేరు వచ్చింది
  • దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
  • అంతరిక్ష ప్రయోగాలకు అదనపు నిధులు కేటాయించడం సరికాదు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతారాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోవడం వల్ల మన దేశానికి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు అదనపు నిధులు కేటాయించాలనుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని అన్నారు.

సౌగతారాయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. మీనాక్షి లేఖి మాట్లాడుతూ, ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. గత సెప్టెంబర్ 7న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Saugata Roy
TMC
Chandrayaan 2

More Telugu News