Arvind Kejriwal: కేజ్రీవాల్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు: గౌతం గంభీర్ విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని బస్టాపులు, మార్కెట్ ప్రాంతాల్లో తాము ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని తాజాగా కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 11,000 ప్రాంతాల్లో త్వరలోనే ఈ సదుపాయాన్ని అందుకోవచ్చని చెప్పారు.

దీనిపై గౌతం గంభీర్ స్పందిస్తూ... 'ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి మరోసారి అసత్యాలు చెప్పారు. ఆయన అబద్ధాలకోరు. నాలుగున్నరేళ్ల క్రితం కూడా ఆయన ఇటువంటి హామీయే ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలే ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ హామీని ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలోనే ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు' అని విమర్శించారు.
Go Back to Shorts
Arvind Kejriwal
gautam gambhir
New Delhi

More Telugu News