జగన్ ను ముఖ్యమంత్రిగా కచ్చితంగా గుర్తించను: పవన్ కల్యాణ్
- రాయలసీమలో పవన్ పర్యటన
- తిరుపతిలో న్యాయవాదులతో సమావేశం
- అధికార పక్షంపై వ్యాఖ్యలు
వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని, ఏ అంశంపై మాట్లాడుతున్నారో వారికసలు అవగాహన ఉందా? అని వ్యాఖ్యానించారు. బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే నిత్యం బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో కష్టసమయంలోనే జనసేన పార్టీ పెట్టానని, మార్పు తెచ్చేందుకు జనసేన కంకణం కట్టుకుందని తెలిపారు. భావితరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.