మీకు మాలాగా జరగదులే...: దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి మెసేజ్
- మా బిడ్డపై అత్యాచారం తరువాత సత్వర న్యాయం జరుగలేదు
- ఏడేళ్లు దాటినా పోరాడుతూనే ఉన్నాము
- దిశ విషయంలో సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాదేవి
కాగా, న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె (23)ను ఆరుగురు దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి నుంచి 17 తెల్లవారుజాము వరకూ ఈ దారుణం జరుగగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు కన్నుమూసింది. దేశ యువతలో వెల్లువెత్తిన నిరసనతో చట్టాలు కఠినమయ్యాయి. కొత్తగా నిర్భయ చట్టం వచ్చిందన్న సంగతి కూడా తెలిసిందే. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడగా, ఓ నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్షను అంగీకరించ వద్దని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫార్సు చేసింది. ఈ కామాంధుడికి సమాజంలో బతికే అర్హత లేదని అభిప్రాయపడింది.