పెట్రోలు అయిపోయిందని 100కు ఫోన్ చేసిన యువతి.. తెచ్చిపోసిన రాచకొండ పోలీసులు
- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
- పోలీసులపై ప్రశంసలు
రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్‌తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో వాహనం పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.