ఏటీఎంలలో ఇలాంటివి కూడా జరుగుతాయి... సీసీ కెమెరాకు చిక్కిన ఘటన!
- క్యాష్ డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన వ్యక్తి
- నగదు కంటే ముందు బయటికి వచ్చిన స్లిప్
- ఆలస్యంగా బయటికి వచ్చిన డబ్బును చేజిక్కించుకున్న మరో వ్యక్తి
అయితే ముందుగా నగదు రావడానికి బదులు రసీదు స్లిప్ బయటికి వచ్చింది. క్యాష్ ఎంతకీ రాకపోవడంతో చిన్నబ్బాయి నిరాశతో ఏటీఎం వెలుపలికి వచ్చాడు. అయితే మెషీన్ నుంచి నగదు కాస్త ఆలస్యంగా బయటికి రాగా, అప్పుడే ఏటీఎంలోకి అడుగుపెట్టిన మరో వ్యక్తి అప్పనంగా ఆ నగదు చేజిక్కించుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ తతంగం ఏటీఎంలో అమర్చిన సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.