చంద్రబాబు, లోకేశ్ పై మాజీ మంత్రి డీఎల్ తీవ్ర ఆరోపణలు
- గతంలో బాబు, లోకేశ్ ల ఆధ్వర్యంలో అవినీతి జరిగింది
- అందువల్లే కింది స్థాయిలోనూ అవినీతి పెరిగిపోయింది
- సామాన్యుడికి అవినీతి సెగ తగిలితే ఏ పార్టీ అయినా మాడి మసి కావాల్సిందే
గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన మాట వాస్తవమే కానీ, ఎన్నికల సమయానికి పార్టీ పరిస్థితి చూసి తానే వెనుకడుగు వేశానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఇసుక గురించి స్పందిస్తూ, ఇసుక విధానం సరిగా అమలు కాకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అవినీతి నిర్మూలన కోసం ప్రధాని మోదీ పోరాడుతున్నారని, అందుకే, రెండోసారి కూడా బీజేపీకే ప్రజలు పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు.