Vani Vishwanath: అప్పుడే మా అమ్మాయికి సినిమాలేంటి?: వాణి విశ్వనాథ్

షార్ట్స్‌లో చూడండి
ఆర్చా... ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న వాణీ విశ్వనాథ్ కుమార్తె. ఆర్చా తాజా చిత్రాలను చూసిన వారంతా, ఆమె ముఖంలో ఉన్న కళను చూసి ఆశ్చర్యపోతూ, ఆర్చాను హీరోయిన్ గా చేస్తున్నారా? అని వాణిని అడుగుతున్నారట.

 తనకు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారని ఇటీవల చెప్పిన వాణీ విశ్వనాథ్, ఆర్చా ఇంకా చిన్న పిల్లని, హీరోయిన్ చేసే ఆలోచన ఉంటే తానే చెబుతానని అంటోంది. పిల్లల ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలన్నదే తన సిద్ధాంతమని అంది. కాగా, ప్రస్తుం ఆర్చా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. డాక్టర్ కావాలన్నది ఆమె లక్ష్యమట. ఇక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారన్న నానుడి ఆర్చాకు కూడా వర్తింస్తుందేమో వేచి చూడాలి.
Go Back to Shorts
Vani Vishwanath
Aarcha
Heroin

More Telugu News