Balakrishna: భారీస్థాయిలో 'రూలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ కథానాయకుడిగా .. భారీ బడ్జెట్ తో 'రూలర్' నిర్మితమవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

విడుదల తేదీకి ఐదు రోజులముందు .. అంటే డిసెంబర్ 15వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగాలనే అభిప్రాయాన్ని బాలకృష్ణ వ్యక్తం చేయడంతో, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే వేదికను ఖరారు చేసి ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Go Back to Shorts
Balakrishna
Sonal
Vedika

More Telugu News