బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కనిపించిన రఘురామకృష్ణంరాజు.. మళ్లీ మొదలైన అనుమానాలు!
- లోక్‌సభలో మాతృభాషకు అనుకూలంగా మాట్లాడి జగన్‌కు ఆగ్రహం తెప్పించిన వైనం
- విజయసాయికి చెప్పకుండా ఎవరినీ కలవొద్దని ఆదేశం
- రెండు రోజులైనా కాకముందే మరోమారు బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షం
దీనిని తీవ్రంగా పరిగణించిన జగన్.. ఎంపీని అమరావతికి పిలిపించుకుని వివరణ అడిగారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలకు చెప్పకుండా కేంద్రమంత్రులు, ప్రధానిని నేరుగా కలవొద్దని ఆదేశించారు. అలా ఆదేశించి రెండు రోజులైనా కాకముందే రఘురామ కృష్ణంరాజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయన లోపలే ఉన్నారు. దీంతో లోపల ఆయన ఎవరిని కలిశారు? ఏ అంశంపై చర్చించారన్న ఉత్కంఠ నెలకొంది. ఆయన తీరుపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.