ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి కార్యాచరణ
- 20 లక్షల మంది లబ్దిదారుల గుర్తింపు
- 40 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా
- 'ఎల్ఐసీ' నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం
ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా. భూమి కొనుగోలు కోసం రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా రుణం తీసుకోవాలని యోచిస్తున్నారు. రూ.10 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.