అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ బోర్డు శుభవార్త!
- పంపానది బేస్ క్యాంపు వరకు వాహనాలకు అనుమతి
- ప్రస్తుతం నీలక్కల్ వద్ద ఆపేస్తున్న పోలీసులు
- బోర్డు నిర్ణయంపై భక్తుల హర్షం
మండల పూజల కోసం గత శనివారం అయ్యప్ప ఆలయం తెరుకుంది. వారం రోజుల్లోనే ఏకంగా 3.5 లక్షల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మున్ముందు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో కార్లను పంపానది బేస్ క్యాంపు వరకు అనుమతించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.