Union Minister Ravishanker Prasad Response on Shiva sena Chief Comments: 30 ఏళ్ల స్నేహాన్ని మరిచి పదవికోసం ఇతరులతో జట్టు కట్టారు: శివసేనపై కేంద్రమంత్రి రవి శంకర్ విమర్శ

  • మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం ఏర్పాటు చేశాం
  • ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది
  • అధికారం కోసం రాజీ పడేవాళ్లు శివాజీ గురించి మాట్లాడొద్దు  

మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి బీజేపీ నైతిక విలువలను మంటగలిపిందన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఆరోపణలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ శివసేన విమర్శించడం తగదన్నారు.

‘30ఏళ్ల స్నేహాన్ని మరిచి ఇతరులతో జట్టు కట్టడం ప్రజాస్వామ్యం ఖూనీ కాదా? అధికారం కోసం రాజీ పడేవాళ్లు శివాజీ గురించి మాట్లాడక పోవడమే మంచిది. గవర్నర్ మూడు పార్టీలనూ ఆహ్వానించారు. తమ వద్ద సంఖ్యాబలం లేదని బీజేపీ అప్పుడు చెప్పింది. మరింత సమయం కావాలని ఎన్సీపీ కోరింది’ అని రవిశంకర్ పేర్కొన్నారు.

More Telugu News