చిన్నారిని నిలదీస్తూ ఆటాడుకున్న రామ్ చరణ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారిని నిలదీస్తూ ఆటాడుకున్న రామ్ చరణ్!

  • చిన్న పిల్లలంటే ఇష్టాన్ని చూపే రామ్ చరణ్
  • బాలుడితో కలిసి జిమ్ చేస్తూ ప్రశ్నలు
  • గంటల వ్యవధిలో లక్షల వ్యూస్
చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టాన్ని చూపించే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఓ జిమ్ లో తనకు తారసపడిన చిన్నారిని నిలదీస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ బాబుతో కలిసి జిమ్ చేసిన రామ్ చరణ్ అతన్ని ఏదో ప్రశ్న అడుగుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆ చిన్నారి సైతం, అంతే దీటుగా రామ్ చరణ్ కు సమాధానం ఇస్తుండగా, ఆపై చరణ్ అతన్ని ఆటపట్టించాడు. ఆ సమయంలో ఎవరో ఈ వీడియోను తీయగా, రామ్ చరణ్, దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

గంటల వ్యవధిలోనే ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్ ను సాధించింది. ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆయన సరసన సీత పాత్రలో ఆలియా భట్ కనిపించనుంది. వచ్చే సంవత్సరం జులై 3న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.





View this post on Instagram









Gym buddies !

A post shared by Ram Charan (@alwaysramcharan) on


Ramcharan
Boy
Instagram

More Telugu News