తమిళ ప్రజల కోసం కమలహాసన్ తో కలిసేందుకు సిద్ధం... రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
- తలైవా కోసం తమిళ ప్రజల ఎదురుచూపులు
- ఇంకా పార్టీ ప్రకటన చేయని రజనీకాంత్
- చర్చనీయాంశమైన తాజా వ్యాఖ్యలు
తమిళ ప్రజల కోసం కమలహాసన్ తో కలిసేందుకు సిద్ధమని రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తామిద్దరి ధ్యేయం అయినప్పుడు తాము ఎందుకు కలవకూడదని రజనీ అభిప్రాయపడ్డారు. కమల్, తాను ఎప్పటికీ మంచి స్నేహితులమేనని రజనీ పునరుద్ఘాటించారు. కాగా, రజనీ తాజా వ్యాఖ్యలపై కమల్ సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.