Vijayashanthi: అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్నవారిలో విజయశాంతి ఒకరట

షార్ట్స్‌లో చూడండి
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, విజయశాంతిని గురించిన ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. కెరియర్ ఆరంభంలో విజయశాంతి ఏదైనా సినిమా ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు చాలా అమాయకంగా .. బెరుకు బెరుకుగా కనిపించేవారు. అలాంటి విజయశాంతి .. 'కర్తవ్యం' సినిమాతో ఒక రేంజ్ కి వెళ్లిపోయారు. ఈ సినిమా .. ఆమెతో చిన్న సినిమాలు చేసే అవకాశం దర్శక నిర్మాతలకి లేకుండా చేసింది.

ఒక దశలో విజయశాంతి తీసుకునే పారితోషికం స్టార్ హీరోలు అందుకునే పారితోషికాన్ని అధిగమించింది. మనదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటుల జాబితాను అప్పట్లో ఒక ఆంగ్లపత్రిక ప్రచురించింది. ఆ జాబితాలో రజనీకాంత్ .. అమితాబ్ పేర్ల తరువాత స్థానంలో విజయశాంతి పేరు వుంది. విజయశాంతి క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Vijayashanthi

More Telugu News