జకీర్ నాయక్‌లా తయారవుతున్నారు: ఒవైసీపై కేంద్రమంత్రి ఫైర్
- సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్ అసంతృప్తి
- అతిగా మాట్లాడొద్దని హితవు పలికిన కేంద్రమంత్రి
- చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరిక
అయోధ్య తీర్పు తర్వాత అసద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అత్యున్నతమైనదే అయినప్పటికీ దోషరహితమైనదేమీ కాదన్నారు. తన పోరాటం భూమి కోసం కాదని, న్యాయపరమైన హక్కుల కోసమని పేర్కొన్న అసదుద్దీన్.. సుప్రీం తీర్పుపై పలుమార్లు బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.