నేనడిగితే ఆ అబ్బాయి నిజంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడు: లక్ష్మీపార్వతి
- తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి నియామకం
- చిన్న పదవి అంటూ జగన్ ఆశ్చర్యపోయారని లక్ష్మీపార్వతి వెల్లడి
- తాను ఏది కోరుకున్నా ఇచ్చేవాడని వ్యాఖ్యలు
"నేను కోరుకోవాలే కానీ ఆ అబ్బాయి నిజంగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడు. అయితే నాకు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం. వాటికి దగ్గరగా ఉండే పదవినే కోరుకున్నాను. ఈ విషయం తెలిసి ఇంత చిన్న పదవి తీసుకుంటున్నారా ఆమె? అని అడిగారట. అంతేకాకుండా, ఆమెకు ఏది ఇష్టమైతే అది ఇవ్వండి అని చెప్పారట" అంటూ లక్ష్మీపార్వతి వెల్లడించారు.