బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించిన శివసేన
- ఛత్రపతి శివాజీ ఏ కులానికో, రాజకీయ పార్టీకో చెందినవాడు కాదు
- మహారాష్ట్రలోని 11 కోట్ల మంది ప్రజలకు చెందినవాడు
- సతారా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉదయన్ రాజె బోస్లే ఓడిపోయారు
- అయినప్పటికీ బీజేపీ.. శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటోంది
'అహంకారాన్ని, మోసపూరిత ధోరణిని ఉపేక్షించొద్దని శివాజీ మహారాజ్ నేర్పారు. శివాజీ మహారాజ్ పేరు చెప్పుకొని, గెలిచి ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత తమ హామీల అమలులో మాట నిలుపుకోలేకపోతే, అలాగే రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్లం తామే అని భావిస్తోంటే ఈ తీరు అంతా వారి పతనానికి సూచనలుగా నిలుస్తాయి' అని బీజేపీని ఉద్దేశిస్తూ సంజయ్ రౌత్ విమర్శించారు.
'గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నర్మదా జిల్లాలో నరేంద్ర మోదీ... సర్దార్ పటేల్ మెమొరియల్ కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాని అయ్యారు. ప్రధానమంత్రి పదవీ కాలం ముగుస్తుందన్న సమయంలో సర్దార్ పటేల్ మెమొరియల్ కు సంబంధించిన పనులను పూర్తి చేశారు' అని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు.