Kurnool District: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వైసీపీ వర్గీయుల మధ్య పరస్పర ఘర్షణ

  • మంచినీటి పైపులైన్ పనుల సందర్భంగా వివాదం
  • రాళ్లదాడిలో ఇద్దరికి గాయాలు
  • రెండూ ఎమ్మెల్యే కాటసాని వర్గాలే

కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో ఈ రోజు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఓ వైసీపీ వర్గం, మరో వర్గంపై దాడికి దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. రెండు వర్గాలు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. స్థానికుల కథనం మేరకు గ్రామంలో మూడు రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది.


దీంతో స్థానిక వైసీపీ నాయకుడు శేఖర్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయం తెలిసి మరో వైసీపీ నాయకుడు భాస్కర్, అతని అనుచరులు రంగప్రవేశం చేసి పనులను అడ్డుకున్నారు. గ్రామంలో పనులు చేపట్టాల్సింది తామేనని, అలాకాదని చేస్తే చంపేస్తామంటూ శేఖర్ వర్గీయులను బెదిరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. భాస్కర్ అనుచరులు కట్టెలు, రాళ్లతో శేఖర్ వర్గీయులపై దాడి చేయడంతో అబ్దుల్ రెహమాన్, మద్దిలేటి అనే ఇద్దరు శేఖర్ వర్గీయులు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News