ఓ సంగీత దర్శకుడు నా అవకాశాలను లాక్కున్నాడు: రఘు కుంచె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ సంగీత దర్శకుడు నా అవకాశాలను లాక్కున్నాడు: రఘు కుంచె

  • ఈ దర్శకుడితో ఇది రెండవ చిత్రం 
  • నాపై నమ్మకం ఉంచినందుకు ఆనందంగా వుంది 
  • అప్పుడు బాధ కలిగిందన్న రఘు  
బుల్లితెరపై యాంకర్ గా .. గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా రఘు కుంచెకి మంచి గుర్తింపు వుంది. 'రాగాల 24 గంటల్లో' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా ఆయన మరోమారు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .."శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాకి నేను పనిచేశాను. మా కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రమిది.

ఈ సినిమాకి సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించాను. నాపై నమ్మకంతో ఆయన అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా వుంది. గతంలో నేను సంగీతాన్ని అందించిన రెండు మూడు సినిమాలకి వేరే సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ చేశాడు. నేను చేయవలసిన వర్క్ ను ఆయన నా నుంచి లాక్కున్నాడు. అలా ఆ అవకాశాలు పోవడం నాకు చాలా బాధ కలిగించింది. మొదటి నుంచి వున్నవారు చేసే పనికి .. మధ్యలో వచ్చి చేరేవారు చేసే పనికి తప్పకుండా తేడా వుంటుంది. 'రాగాల 24 గంటల్లో' రీ రికార్డింగ్ పరంగా కూడా నాకు మంచి పేరు తెస్తుంది" అని ఆయన చెప్పుకొచ్చాడు.
Raghu Kunche
Srinivas Reddy

More Telugu News