గోవాలో 'రొమాంటిక్' సాంగ్ చిత్రీకరణ
- మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథ
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
నిన్నమొన్నటివరకూ అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం అక్కడ నాయకా నాయికల కాంబినేషన్లో ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ పాటనే చిత్రీకరిస్తారట. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో, రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.