మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!

  • 6 వేల నుంచి 3,500 యూనిట్లకు తగ్గిన తయారీ
  • ఉద్యోగాన్ని కోల్పోయిన 1000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు
  • సమ్మెకు దిగిన ఉద్యోగ సంఘాలు
హర్యానాలోని మనేసర్ లో ఉన్న తమ ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంటును నిరవధికంగా మూసివేస్తున్నట్టు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వెల్లడించింది. ఈ ప్లాంటు కార్మికులు గత కొంతకాలంగా సమ్మె చేస్తుండగా, సాధారణ కార్యకలాపాలన్నీ నిలిపివేశామని సంస్థ ప్రకటించింది.

యూనియన్ నేతలు, ప్లాంట్ మేనేజ్ మెంట్ మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదని ఈ సందర్భంగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. యూనియన్ నేతలు, శాశ్వత ఉద్యోగులు కలిసి కాంట్రాక్ట్ కార్మికులను రెచ్చగొడుతున్నారని, కంపెనీ ప్రాంగణంలోనే వీరంతా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దిగారని హోండా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో బైక్ ల తయారీ సాధ్యం కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్న తరువాత, పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.

కాగా, బైక్ ల తయారీలో కోత విధించిన తరువాత, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 5 నుంచి హోండా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి పొలిటికల్ పార్టీలు, మిగతా ప్లాంట్ల యూనియన్లు మద్దతిస్తున్నాయి. ఇక్కడ రోజుకు తయారయ్యే బైక్ ల సంఖ్య 6 వేల నుంచి 3,500కు తగ్గడంతో దాదాపు 1000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇదే సమయంలో నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకూ సవరించాల్సిన పేస్కేల్ ను కూడా యాజమాన్యం సవరించలేదని కార్మికులు ఆరోపిస్తూ సమ్మెకు దిగారు.
Honda
MHSI
Manesar
Clousure
Shutdown

More Telugu News