హరీశ్ రావు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరీశ్ రావు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులు

  • ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ
  • సిద్ధిపేటలో హరీశ్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన కార్మికులు
  • పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు మంత్రి హరీశ్ రావు ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు యత్నించారు. సిద్ధిపేటలోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కార్మికులు వారిని తోసుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హరీశ్ నివాసం ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలో కొందరు మహిళా కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Harish Rao
TRS
RTC Strike

More Telugu News