ఐటమ్ గాళ్ కు ఓట్లేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య
Add ap7am to your home Screen

ఐటమ్ గాళ్ కు ఓట్లేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య

  • నటాషా స్టాంకోవిచ్ తో పాండ్య చెట్టాపట్టాల్
  • నాచ్ బలియే డ్యాన్స్ షోలో పోటీపడుతున్న నటాషా
  • బాలీవుడ్ లో ఐటమ్ గాళ్ గా గుర్తింపు తెచ్చుకున్న సెర్బియా అమ్మాయి
టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవలే గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే కొన్నిరోజులుగా హార్దిక్ పాండ్య బాలీవుడ్ ఐటమ్ గాళ్ నటాషా స్టాంకోవిచ్ కు ఓట్లేసి గెలిపించాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. నటాషా 'నాచ్ బలియే' అనే డ్యాన్స్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఆమె షారుఖ్ ఖాన్ మూవీ 'జీరో'లో ఓ పాత్రలో నటించింది. నటాషా మన దేశస్థురాలు కాదు. ఆమె సెర్బియాకు చెందిన నటి. అయితే బాలీవుడ్ లో ఐటమ్ గాళ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

నటాషాతో హార్దిక్ పాండ్య కొన్నిరోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. కెమెరా కళ్లకు కూడా వీరిద్దరూ జంటగా చిక్కడంతో ఊహాగానాలకు బలం చేకూరుతోంది. హార్దిక్ ఈ వేసవిలో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేసినట్టు తెలుస్తోంది.
Hardik Pandya
Natasha Stankowic
Cricket
Bollywood

More Telugu News