పాటపాడుతూ రక్త పరీక్ష కోసం చిన్నారి రక్తాన్ని తీసిన వైద్యుడు.. నొప్పి తెలియకుండా టెక్నిక్.. వీడియో వైరల్
- స్కాట్లాండ్ లో ఘటన
- కొంచం కూడా ఏడవని పాప
- ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన తల్లి
షానన్ అనే మహిళ తన పాపకు రక్తపరీక్ష చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో డాక్టర్ ర్యాన్ కోట్జీ.. 'అన్ఫర్గెటబుల్' అనే పాట పాడుతూ రక్తం తీశాడు. దీంతో ఆ పాప అస్సలు ఏడవలేదు. తన బిడ్డకు నొప్పి తెలియకుండా ఆ వైద్యుడు పాట పాడినందుకు కృతజ్ఞతలు అంటూ షానన్ తన ఫేస్ బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వైద్యుడు చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫేస్ బుక్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.