విమానం ఆలస్యం...శంషాబాద్‌లో ఆందోళనకు దిగిన ప్రయాణికులు
- రీ షెడ్యూల్ చేసిన ఎయిరిండియా యాజమాన్యం
- ఉదయం 6.10 గంటలకు బయలుదేరాలి
- మధ్యాహ్నం 3 గంటలకు సమయం మార్పు
ఎప్పటిలాగే సమయానికి ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్నారు. తీరా వచ్చాక విమానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు రీషెడ్యూల్ చేసినట్టు ఎయిరిండియా సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో ముందస్తు సమాచారం లేకుండా ఇదేం తీరంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొంది.