విజయారెడ్డికి పట్టిన గతే నీకు కూడా... పొదిలి తహసీల్దారుకు కానిస్టేబుల్ హెచ్చరిక!
- ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి
- ప్రభాకర్ రావుకు హెచ్చరికలు
- కలెక్టర్, ఎస్పీలకు తహసీల్దారు ఫిర్యాదు
హైదరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిష్టా రెడ్డి అనే యువకుడు ఈ పోస్టులు పెట్టినట్టు సమాచారం. తన ఫేస్ బుక్ ఖాతాలో తహసీల్దారును బెదిరిస్తూ, పొదిలి మండలం రెవిన్యూ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే విజయారెడ్డికి పట్టిన గతే పడుతుంది అంటూ హెచ్చరించాడు. ఇక ఈ పోస్టులు వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్, ఏస్పీ దృష్టికి తహసీల్దారు తీసుకెళ్లగా, కార్యాలయంలో బందోబస్తును పెంచారు.