విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ ఎవరో నాకు తెలియదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
- విజయారెడ్డి హత్య దురదృష్టకరం
- నిందితుడిని కఠినంగా శిక్షించాలి
- ప్రతిరోజు నన్ను ఎందరో కలుస్తుంటారు
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేశ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది ప్రతిరోజు తనను కలుస్తుంటారని తెలిపారు. విజయారెడ్డి హత్య దురదృష్టకరమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఈ ఉదయం విజయారెడ్డి భౌతికకాయానికి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.