IMD: మరిన్ని వర్షాలు పడే ఛాన్స్ ... వాయుగుండంగా మారిన అల్పపీడనం!

షార్ట్స్‌లో చూడండి
బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం, ఇప్పుడు వాయుగుండంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది బుధవారం నాటికి తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఒడిశాలోని పారాదీప్‌ కు దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ వైపునకు కదులుతోందని తెలిపారు. ఇది తీరం దాటేందుకు మరో రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
IMD
Tufan
Low Preasure
Odisha
Cyclone

More Telugu News