ఎయిర్ టెల్ ప్లాన్ తో రూ. 4 లక్షల జీవిత బీమా ఉచితం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ టెల్ ప్లాన్ తో రూ. 4 లక్షల జీవిత బీమా ఉచితం!

  • రూ.599 రీఛార్జి ప్లాన్ తో రూ.4 లక్షల బీమా
  • భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ తో ఒప్పందం
  • రీఛార్జి చేసుకున్నప్పుడల్లా బీమా పొడిగింపు
వినియోగదారులకు సేవలందించడంలో జియో, వోడాఫోన్ సంస్థలతో పోటీపడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త పథకాన్ని ప్రకటించింది. రూ.599 ప్లాన్ ఎంపిక చేసుకున్నవినియోగదారులకు తన భాగస్వామ్య సంస్థ భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.4 లక్షల విలువైన జీవిత బీమాను కూడా అందించనున్నట్లు తెలిపింది. వినియోగదారులకు ఈ సౌకర్యం అందించడానికి ఎయిర్ టెల్ సంస్థ భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ అధికారిణి వాణి వెంకటేశ్ మీడియాకు తెలిపారు.

 ‘ఈ కొత్త ప్లాన్ లో రూ.599 తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతీరోజు 2 జీబీ డేటా, ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత కాల్స్ చేసుకునే వీలు, రోజుకు 100 సంక్షిప్త సందేశాలు పంపుకునేందుకు అవకాశముంటుంది. దీని కాలపరిమితి 84రోజులు. వీటికి అదనంగా వినియోగదారులు రూ.4 లక్షల విలువైన జీవిత బీమా సౌకర్యం కూడా పొందుతారు. దీని కాలపరిమితి మూడు నెలలు ఉంటుంది. రీచార్జ్ చేసుకున్న ప్రతీసారి బీమా కాలపరిమితి పొడిగించబడుతుంది.

18 ఏళ్ల నుంచి 54 ఏళ్ల వయసున్నవారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకు ఎలాంటి పత్రాలు, ఆరోగ్య ప్రమాణ పత్రాలు సమర్పించవలసిన పనిలేదు. డిజిటల్ రూపంలో ఇన్సూరెన్స్ పత్రాలు వినియోగదారుడికి అందుతాయి’ అని ఎయిర్ టెల్, భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించాయి.

ఈ బీమా సౌకర్యం పొందాలనుకునేవారు రీచార్జ్ అనంతరం ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్ టెల్ రీటైలర్ ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  
air tel
life insurence
Barathi axa life insurance
Rs.599 plan

More Telugu News