బిగ్ బాస్-3: నీకూ నాకూ మాత్రమే తెలిసిన విషయం అంటూ తమన్నాతో వ్యాఖ్యానించిన చిరు.. కన్నీళ్లు పెట్టిన తమన్నా
- బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే
- చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
- కంటెస్టెంట్లతో సందడి చేసిన చిరు
"ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు. ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు" అని చిరంజీవి అంటుండగానే తమన్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అసలు చిరు దేనిగురించి మాట్లాడుతున్నాడో అక్కడెవరికీ అర్థంకాలేదు. అయితే చిరంజీవి మళ్లీ అందుకుని, "ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ" అంటూ అభినందించేసరికి తమన్నా తీవ్ర భావోద్వేగాలకు లోనైంది.