Nara Lokesh: మొట్టికాయలు పడితే కానీ వీళ్ల కళ్లు తెరుచుకోవు... ప్రెస్ కౌన్సిల్ నిర్ణయంపై లోకేశ్ వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో మీడియాపై నియంత్రణ కోసం ఉద్దేశించిన జీవో 2430 అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సుమోటోగా స్పందించింది. ఈ వ్యవహారంపై నారా లోకేశ్ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తే టీడీశాట్ మందలించిందని తెలిపారు. రోజుకు రూ.2 లక్షలు జరిమానా విధించినా వైఎస్ జగన్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. ఇప్పుడు చీకటి జీవో 2430పై పీసీఐ స్వయంగా స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసిందని వెల్లడించారు. "వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు, మొట్టికాయలు పడేదాకా వీళ్లకి కళ్లు తెరుచుకోవు" అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
GO 2430
Jagan
YSRCP
Andhra Pradesh
Telugudesam

More Telugu News