Rohit Sharma: రోహిత్ కు తగిలిన దెబ్బ చిన్నదే: బీసీసీఐ

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో రేపు టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే, నిన్న ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటం కలవరపాటుకు గురి చేసింది. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ ఉదర భాగానికి బంతి బలంగా తగిలింది. నొప్పితో బాధ పడ్డ రోహిత్, ప్రాక్టీస్ ను ఆపేసి వెళ్లిపోయాడు. దీంతో, రోహిత్ రేపటి మ్యాచ్ లో ఆడతాడా, లేదా అనే ఆందోళన నెలకొంది. అయితే, రోహిత్ కు తగిలిన దెబ్బ సాధారణమైందేనని బీసీసీఐ ప్రకటించింది. రేపటి టీ20లో రోహిత్ ఆడతాడని తెలిపింది. మరోవైపు, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు బంగ్లా ప్లేయర్లు మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేయడం గమనార్హం.
Go Back to Shorts
Rohit Sharma
BCCI
Injury

More Telugu News