Sensex: వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. మెటల్, టెలికాం, బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ ను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 40,165కి పెరిగింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 11, 899 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.02%), టాటా స్టీల్ (4.18%), వేదాంత లిమిటెడ్ (3.71%), టెక్ మహీంద్రా (2.73%), యాక్సిస్ బ్యాంక్ (1.75%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-6.17%), టీసీఎస్ (-2.91%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.66%), ఏసియన్ పెయింట్స్ (-2.28%), టాటా మోటార్స్ (-1.52%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News