15 అంగుళాల ఎత్తు, 22 అంగుళాల పొడవు... నిన్ననే పుట్టిన బుజ్జి దూడ ఇది!

షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా అవుకు దూడ పుడితే ఎలా ఉంటుంది? దాదాపు ఒక మీటర్ ఎత్తు, మీటరున్నర పొడవు కచ్చితంగా ఉంటుంది. కానీ, ఇది చాలా ప్రత్యేకమైన దూడ. దీని ఎత్తు కేవలం 15 అంగుళాలు మాత్రమే..ఇక పొడవు 22 అంగుళాలు. పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఇటువంటి అరుదైన దూడ జననం తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు సమీపంలోని గుమ్మిలేరులో జరిగింది. ఈ ఆవు యజమాని ముత్తాల భాస్కరరావు. ఒంగోలు రకానికి చెందిన ఈ ఆవుకు పెయ్యదూడ ఇంత చిన్నగా పుట్టడంతో, చుట్టుపక్కల నుంచి జనం వచ్చి చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
Go Back to Shorts
Ox
Cow
East Godavari District
Small Claff

More Telugu News