వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ కు క్వాలిఫై అయిన రెండు కొత్త జట్లు!
- వచ్చే ఏడాది అక్టోబర్ 18న ప్రపంచకప్ ప్రారంభం
- నవంబర్ 15న మెల్బోర్న్ లో ఫైనల్స్
- అర్హత సాధించిన పపువా న్యూ గినియా, ఐర్లండ్
మొత్తం 16 టీములు ప్రపంచకప్ లో పోటీ పడబోతున్నాయి. ఐసీసీ ఫుల్ మెంబర్స్ అయిన ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజీలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లు ఈ టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. క్వాలిఫైయర్ కేటగిరిలో ఇప్పటి వరకు పపువా న్యూ గినియా, ఐర్లండ్ క్వాలిఫై అయ్యాయి. మరో నాలుగు జట్లు అర్హత సాధించాల్సి ఉంది.