eggs: ప్రతి రోజు తనకిష్టమైన కోడిగుడ్లు తెచ్చిస్తున్న ప్రియుడితో పారిపోయిన వివాహిత

షార్ట్స్‌లో చూడండి
చిన్న విషయాలకే అలిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా, కంపేర్‌గంజ్‌లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. తనకు ఇష్టమైన కోడిగుడ్లు తీసుకురావడం లేదని, భర్తను వదిలి వెళ్లిపోయిందో భార్య. కంపేర్‌గంజ్‌లో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త కూలీ పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే, ప్రతిరోజు తినడానికి గుడ్లు ఉండాల్సిందేనని అతడిని భార్య కోరేది.

అందుకు కూలీ డబ్బులు సరిపోకపోవడంతో ఆ భర్త తన భార్య కోరికను నెరవేర్చడం లేదు. దీంతో నిన్న ఆమె భర్తతో గొడవపడి ప్రియుడితో పారిపోయింది. ఆ భర్త ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తన బాధను చెప్పుకున్నాడు. తానో దినసరి కూలీనని, ఈ బలహీనతతో తన భార్య తనతో ఆడుకుందని వాపోయాడు. ఆమె ప్రియుడు ప్రతి రోజు గుడ్లు తెచ్చి ఇచ్చేవాడని చెప్పాడు. అందుకే అతడితో ఆమె పారిపోయిందని చెప్పాడు.


Go Back to Shorts
eggs
Uttar Pradesh

More Telugu News