India: భారత్ తో వాణిజ్య విభేదాలకు స్వస్తి పలకాలి: ట్రంప్ సర్కారుపై పెరుగుతున్న ఒత్తిళ్లు

  • వాణిజ్య సంబంధాల కోసం చర్యలు చేపట్టాలన్న వ్యాపార ప్రతినిధులు
  • ట్రంప్ ప్రభుత్వానికి లేఖ
  • తమ వ్యవసాయోత్పత్తులకు భారత్ అతి పెద్ద మార్కెట్ అని వ్యాఖ్యలు

అమెరికా, భారత దేశాల మధ్య వాణిజ్య విభేదాలను ముగింపునకు  ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆలస్యం జరగడంపై అమెరికా వ్యాపార ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విభేదాలకు స్వస్తి పలికి సుహృద్భావ పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం కొనసాగాలని వారు ఆశిస్తున్నారు. భారత్ కు జీఎస్పీ హోదా తొలగించడం తమ ఉత్పత్తుల వాణిజ్యానికే ప్రతిబంధకంగా మారిందని ఆ దేశ ప్రతినిధులు అంటున్నారు. ముఖ్యంగా పెకాన్ ఎండుపలాలకు భారత్ అతిపెద్ద మార్కెటని చెపుతూ తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.  

 ప్రధానంగా అమెరికా ఎగుమతిచేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్నసుంకం తమ దేశ గ్రామీణ ఉత్పత్తిదారులకు ప్రతికూలంగా మారాయని 34 మంది ప్రతినిధులు ఆదేశ వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్ కు లేఖ రాశారు. అమెరికా ఎగుమతి చేస్తున్న పెకాన్ అనే ఎండు ఫలలాపై భారత్ విధిస్తున్న సుంకం మరీ ఎక్కువగా ఉందని  తమ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై భారత్ విధిస్తున్న సుంకాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని వారు రాబర్ట్ ను కోరారు. గత నెలలో కూడా  రెండు ప్రధాన పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇదే రీతిలో శ్వేతసౌధం వర్గాలకు లేఖ అందజేశారు.

జూన్ లో అమెరికా ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) జాబితా నుంచి భారత్ ను తొలగించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరస్పర ఎగుమతులపై సుంకాల పెంపు కొనసాగుతోంది.

More Telugu News