బీజేపీకి సీఎం పదవి, జేజేపీకి ఉపముఖ్యమంత్రి పదవి... హర్యానాలో కుదిరిన ఒప్పందం
- హర్యానాలో తొలగిన అనిశ్చితి
- ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సంసిద్ధం
- స్థిరత్వం కోసమే కూటమి ఏర్పాటు చేశామన్న అమిత్ షా
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 40 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కు 31 స్థానాలు రాగా, 10 స్థానాలు నెగ్గిన జన్ నాయక్ జనతా (జేజేపీ) పార్టీ కింగ్ మేకర్ గా అవతరించింది. దాంతో బీజేపీ... జేజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. కాగా, జేజేపీతో ఒప్పందం కుదరడంలో అమిత్ షా కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.