కాసేపట్లో దుష్యంత్ మీడియా సమావేశం.. 'హర్యానాలో జేజేపీ మద్దతు ప్రకటన'పై ఉత్కంఠ
- పార్టీ ఎమ్మెల్యేలతో దుష్యంత్ చౌతాలా భేటీ
- తీహార్ జైలుకెళ్లి తన తండ్రిని కలవనున్న జేజేపీ అధినేత
- ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు వ్యూహాలు?
ఆ రాష్ట్రంలో 10 సీట్లతో జేజేపీని మూడో అతిపెద్ద పార్టీగా నిలిపి, కింగ్ మేకర్ గా మారిన ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆయన చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఆయనను తమ వైపునకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.