జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ... ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
Add ap7am to your home Screen

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ... ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

  • త్రాల్ లో కాల్పులు
  • వివరాలు తెలిపిన కశ్మీర్ పోలీస్ చీఫ్
  • భద్రత బలగాలకు విజయం
భారత్ లో విధ్వంసం సృష్టించడానికి సదా సిద్ధంగా ఉండే పాకిస్థాన్ ప్రోద్బలిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ లో జైషే సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలో భారత భద్రత బలగాలు ఎదురుకాల్పుల్లో ఈ ముగ్గురు ముష్కరులు మృతి చెందినట్టు జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్ బాగ్ సింగ్ తెలిపారు.. కాగా, హతులైన ఈ ముగ్గురు ఉగ్రవాదులు గత ఆగస్టులో గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సోదరులను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
JeM
Jammu And Kashmir

More Telugu News